: కోలుకుంటున్న బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్
బాలీవుడ్ నట దిగ్గజం దిలీప్ కుమార్ అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారు. గుండెపోటు కారణంగా ఆయన రెండ్రోజుల క్రితం ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం దిలీప్ కుమార్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఆదివారం ఆయనకు హార్ట్ ఎటాక్ రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.