: నవంబర్లో రెండో శనివారం పనిదినం: రాష్ట్ర సర్కారు ప్రకటన


ప్రతినెల రెండో శనివారం మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ఉంటుంది. కానీ, నవంబర్ నెల రెండో శనివారం ఈసారి సెలవు లేదు. ఎందుకంటే గణేశ్ నిమజ్జనం సందర్భంగా రేపు (18వ తేదీ)అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. దాంతో, ఈ సెలవును నవంబర్ లో పనిదినంగా మార్చాలని ఆలోచించిన ప్రభుత్వం ఈ మేరకు ఓ జీవో జారీ చేసింది. అటు అక్టోబర్లో దసరా పండుగ ఉండటం, ఆ నెలలో రెండో శనివారం దసరా సెలవుల్లో భాగం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

  • Loading...

More Telugu News