: కాంగ్రెస్, వైఎస్సార్సీపీ మధ్య ఫిక్సింగ్: కొనకళ్ల
కాంగ్రెస్, వైఎస్సార్సీపీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని తెలుగుదేశం ఎంపీ కొనకళ్ల ఆరోపించారు. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అక్రమాస్తుల కేసులో అరెస్టయిన జగన్ బెయిల్ పై వస్తారని ఆయన సోదరి షర్మిల చెబుతోందని... ఏ ఆధారాలతో ఆమె ఈ వ్యాఖ్యలు చేస్తోందో బహిరంగపరచాలని డిమాండ్ చేశారు. రెండు పార్టీల మధ్య డీల్ కుదిరింది కాబట్టే అంత ధీమాగా చెబుతున్నారని అన్నారు.