: సమ్మెను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది: శ్రీనివాస్ గౌడ్
సీమాంధ్రలో ఉద్యోగుల సమ్మె, ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై టీజీవో అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, కావాలనే ప్రభుత్వం సీమాంధ్రలో సమ్మెను ప్రోత్సహిస్తోందన్నారు. గతంలో తెలంగాణ ఉద్యోగులు సహాయ నిరాకరణ చేసినప్పుడు మంత్రివర్గ ఉపసంఘం పలుమార్లు చర్చలకు పిలిచిందని చెప్పారు. అయితే, ఇప్పుడు సీమాంధ్ర ఉద్యోగులతో చర్చించి సమ్మె విరమింపజేయడానికి మాత్రం ఎందుకు ప్రయత్నం చేయడంలేదని ప్రశ్నించారు. దీన్నో ప్రభుత్వ కార్యక్రమంగా ప్రోత్సహిస్తోందని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు.