: మెరిసిన మిస్బా
చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీ అర్హత పోటీల్లో భాగంగా తొలి మ్యాచ్ మొహాలీలో జరుగుతోంది. ఒటాగో వోల్ట్స్ జట్టుపై టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఫైసలాబాద్ వోల్వ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 139 పరుగులు చేసింది. ఆ జట్టులో కెప్టెన్ మిస్బా ఉల్ హక్ 34 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సు ల సాయంతో 46 పరుగులు సాధించాడు. ఒటాగో బౌలర్లలో బట్లర్, మెక్ మిలన్, నీషామ్ తలో రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో ఒటాగో జట్టు 6 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది.