: తెలంగాణ కోసం ఆందోళన జరుగుతున్నా పట్టించుకోరేం: కేంద్రాన్ని నిలదీసిన రాజ్ నాథ్


తెలంగాణ అంశంపై కాంగ్రెస్ ప్రకటించిన వాగ్దానాలు కేవలం మాటల వరకే పరిమితమయ్యాయని, ప్రత్యేక రాష్ట్రం కోసం పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ఆరోపించారు.

తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తామని ఎప్పుడో చెప్పామని రాజ్ నాథ్ పేర్కొన్నారు. ఒకవేళ కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోతే తాము అధికారంలోకి వస్తే తక్షణమే ప్రత్యేక రాష్ట్ర ప్రకటన చేస్తామని ఆయన అన్నారు. లోక్ సభలో ఈ రోజు తెలంగాణ అంశాన్ని ప్రస్తావించిన రాజ్ నాథ్.. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. 

  • Loading...

More Telugu News