: సర్కారు తీరు సమ్మె విరమింపజేసేలా లేదు: హైకోర్టు


ఏపీఎన్జీవోల సమ్మెపై హైకోర్టులో రెండోరోజు కూడా వాదనలు జరిగాయి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు జరిగిన వాదనల్లో ఏపీఎన్జీవో తమ వాదనలు వినిపించగా, అటు కోర్టు కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది. సమ్మె విరమింపజేసేలా కాకుండా సమ్మె తీవ్రత తగ్గించేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని అభిప్రాయపడింది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అలసత్వం వహిస్తున్నట్లు ఉందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఏపీఎన్జీవోలతో చర్చలకు ఏ న్యాయసూత్రం అనుమతిస్తుందని ప్రశ్నించింది. కాగా, తమ సమ్మె వల్ల ఇబ్బందులు పడుతున్నామని ఇంతవరకూ ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఏపీఎన్జీవో తన వాదనల్లో పేర్కొంది. సమ్మె విషయమై ప్రభుత్వానికి ముందే నోటీసు ఇచ్చామని హైకోర్టుకు చెప్పింది. సమ్మెపై వేసిన వ్యాజ్యం విచారణార్హం కాదని, పిటిషనర్ కు సదుద్దేశం లేదని ఏపీఎన్జీవో పేర్కొంది. వాదనలు విన్న అనంతరం విచారణను కోర్టు రేపటికి వాయిదావేసింది.

  • Loading...

More Telugu News