: రెండువారాల్లో ఉల్లి ధరలు దిగివస్తాయి: కేంద్రం
కోయకుండానే ప్రజలకు కళ్ళవెంబడి నీళ్ళు తెప్పిస్తున్న ఉల్లి ధరలు మరో పక్షం రోజుల్లో దిగివస్తాయని కేంద్ర ఆహార శాఖ మంత్రి కేవీ థామస్ పేర్కొన్నారు. ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, మరో రెండు వారాల్లోగా దేశంలో తాజా ఉల్లి పంట మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్నామని, తద్వారా ధరలు అదుపులోకి వస్తాయని వివరించారు. నిత్యావసరాలను దుబారా చేయడంతోపాటు, పంటను అక్రమంగా నిల్వ ఉంచడం కూడా ధర పెరుగుదలకు కారణమని మంత్రి సూత్రీకరించారు. ఉల్లి నిల్వలను కాపాడుకోవాలన్న తమ హెచ్చరికలను రాష్ట్రాలు పెడచెవిన పెట్టడమూ ధరల పెరుగుదలకు ఓ కారణమని చెప్పారు.