: రాష్ట్రంలో భారీ వర్షాలకు అవకాశం
రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాదులోని వాతావరణ శాఖ తెలిపింది. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు తెలంగాణ జిల్లాలలో వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.