: కష్టాల్లో భారత్-ఎ


విండీస్-ఎ జట్టుతో రెండో వన్డేల్లో భారత్-ఎ కష్టాల్లో పడింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో.. లక్ష్యఛేదనలో ఆతిథ్య జట్టు 148 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ యువరాజ్ (40), ఉన్ముక్త్ చాంద్ (38), కేదార్ జాదవ్ (35) రాణించినా కరీబియన్ బౌలర్ల ధాటికి భారీ స్కోర్లు సాధించలేకపోయారు. విరుచుకుపడతాడనుకున్న యూసుఫ్ పఠాన్ డకౌట్ కావడంతో భారత్-ఎ కష్టాలు రెట్టింపయ్యాయి. విండీస్-ఎ బౌలర్లలో కమిన్స్ 2, మిల్లర్ 2 వికెట్లు తీసి భారత్-ఎ బ్యాటింగ్ లైనప్ ను ఒత్తిడిలోకి నెట్టారు. ఆతిథ్య జట్టు గెలవాలంటే 15 ఓవర్లలో 132 పరుగులు చేయాలి. చేతిలో 4 వికెట్లున్నాయి. అంతకుముందు విండీస్-ఎ 6 వికెట్లకు 279 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News