: అక్కినేని జన్మదిన వేడుకలు నిర్వహించనున్న టీఎస్సార్
తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కులా బాసిల్లుతున్న నట దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు ఈనెల 20న 90వ జన్మదినోత్సవాన్ని జరుపుకోనున్నారు. ఆయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలని టి.సుబ్బరామిరెడ్డి లలితకళా పరిషత్తు నిర్ణయించింది. రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి హైదరాబాదులోని రవీంద్రభారతి వేదిక. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్ హాజరవుతారు. ఇంకా ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి చిరంజీవి, 'లోకాయుక్త' జస్టిస్ బి.సుభాషణ్ రెడ్డి, సినారె, రామానాయుడు,ప్రముఖ నటీమణి వైజంతీమాల తదితరులు పాల్గొననున్నారు. అక్కినేని కుటుంబ సభ్యులు కూడా ఈ వేడుకలకు హాజరవుతారు. కాగా, చిరంజీవి ఈ సందర్భంగా అక్కినేనికి 90 వసంతాల గుర్తుగా వెండి జ్ఞాపికను బహూకరిస్తారు.