: భారత్-ఎ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ


విండీస్-ఎ జట్టుతో రెండో వన్డేలో భారత్-ఎ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కరీబియన్లు విసిరిన 280 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్-ఎ 18 పరుగులకే రెండు వికెట్లను చేజార్చుకుంది. ఓపెనర్ రాబిన్ ఊతప్ప 10 పరుగులు చేసి కార్టర్ కు బౌల్డవగా, మన్ దీప్ సింగ్ (3) కమిన్స్ బౌలింగ్ లో వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో, బ్యాటింగ్ భారం కెప్టెన్ యువరాజ్ సింగ్ (5 బ్యాటింగ్), యువ ఆటగాడు ఉన్ముక్త్ చాంద్ (12 బ్యాటింగ్)పై పడింది. ప్రస్తుతం భారత్-ఎ 9 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 33 పరుగులతో ఆడుతోంది.

  • Loading...

More Telugu News