: పుట్టిన రోజు సందర్భంగా తల్లి ఆశీస్సులు అందుకున్న మోడీ
గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఈ రోజు 64వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన తన తల్లి హీరాబెన్ ను కలిసి ఆశీస్సులు అందుకున్నారు. తన కుమారుడు జీవితంలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆమె ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ... పుట్టిన రోజు నాడు తల్లి నుంచి దీవెనలు పొందడం గొప్ప అనుభూతినిస్తుందని అన్నారు. దీనికి తోడు ప్రజల ఆశీర్వాదాలు తనకున్నాయని... ఇవి తనకు మరింత బలాన్నిస్తాయని తెలిపారు. పుట్టిన రోజు సందర్భంగా మోడీకి బీజేపీ అగ్రనాయకులు శుభాకాంక్షలు తెలిపారు.