: మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలివ్వండి: సీఎంకు బీజేపీ నేతల వినతి


హైదరాబాద్ జంట పేలుళ్ల ఘటనలో మృతుల కుటుంబాలకు నష్టపరిహారం పెంచాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం అందిస్తున్న పరిహారాన్ని రూ. 10 లక్షలకు పెంచాలని కోరుతూ కిషన్ రెడ్డి, దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి తదితరులు సచివాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు.

శాశ్వత వైకల్యం పొందిన వారికి పరిహారం అందించడమే కాకుండా జీవిత కాలం వైద్య సేవలు అందించాలని కోరారు. అలాగే, పేలుళ్ల బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలివ్వాలన్నారు. కేసు దర్యాప్తును త్వరితగతిన సాగేట్టు చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు. బాధితులకు మెరుగైన వైద్యసదుపాయాలు అందడంలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని కూడా బీజేపీ నేతలు సూచించారు. 

  • Loading...

More Telugu News