: దేశానికి, రాష్ట్రానికి విభజన మంచిది కాదు: కావూరి


కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు రాష్ట్ర విభజనకు వ్యతిరేకత తెలుపుతున్నారు. రాష్ట్రాన్ని విభజించడం వల్ల దేశానికి, రాష్ట్రానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని ఆయన అన్నారు. 2009లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై చేసిన ప్రకటన, ఇటీవల సీడబ్ల్యూసీ చేసిన విభజన ప్రకటన కూడా సరైనవి కావన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు వద్ద కావూరిని సమైక్యవాదులు అడ్డుకున్నారు. రాజీనామా చేయాల్సిందేనని గట్టిగా డిమాండ్ చేశారు. అనంతరం కావూరి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర మంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు మళ్లీ అధిష్ఠానాన్ని కలవనున్నట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News