: పిండి తాగితే ప్రమాదమే!


పళ్లను అలాగే తినడంకన్నా కూడా రసం రూపంలో తాగితే ఎక్కువ పండ్లను తీసుకోవచ్చని, దీనివల్ల మరింత మేలు జరుగుతుందని మనలో చాలామంది అనుకుంటారు. అయితే ఇలా పళ్లరసం తీసుకోవడం వల్ల మేలుకన్నా కూడా కీడే ఎక్కువగా జరుగుతుందట. ఈ విషయం కొందరికి తెలిసినా దాన్ని గురించి పట్టించుకోరు. ఇలాంటి వారిని శాస్త్రవేత్తలు మరోసారి హెచ్చరిస్తున్నారు. పండ్లను నేరుగా తీసుకోవడమే మేలని, రసాల రూపంలో పండ్లను తీసుకోవడం వల్ల మధుమేహం ముప్పు ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు మాత్రం ఇలా పళ్లను రసం తీసి తాగడం మాత్రం మరింత ప్రమాదకరమని ఈ అధ్యయనంలో తేలింది. అంతేకాదు, ఒక క్రమపద్ధతిలో పండ్లను తినడం వల్ల రక్తంలో చక్కెర తగ్గుముఖం పడుతుందని, అలాగే పళ్ల రసాలు తీసుకునే వారిలో మధుమేహం క్రమంగా పెరుగుతోందని ఈ అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనాన్ని నిర్వహించిన నిపుణులు, గత పాతికేళ్ల కాలంలో అమెరికా ఆసుపత్రుల్లోని మధుమేహ రోగులకు సంబంధించిన సమాచారాన్ని తీసుకున్నారట. అలాగే 1,87,000 మంది నర్సులు, ఆరోగ్య సహాయకులను ఇందులో భాగంగా ఇంటర్వ్యూలు చేశారట. వీటన్నింటి ఫలితాలను విశ్లేషిస్తే వారంలో కనీసం రెండుసార్లు పళ్లను మాత్రమే ఆహారంగా తీసుకున్న వారిలో మధుమేహం 23 శాతం తగ్గుతోందని, క్రమం తప్పకుండా పళ్లరసాలను తీసుకునేవారిలో 21 శాతం మధుమేహం పెరుగుతోందని తేలింది. కాబట్టి పళ్లను కాకుండా రసాలను తాగేవారు ఇకనైనా తమ అలవాటును మానుకుని పళ్లను నేరుగా తీసుకుంటే మేలని పరిశోధకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News