: ఈ దారం కూడా బలమైందట!
బరువులెత్తడానికి ఆయా బరువును బట్టి దారాలను ఉపయోగిస్తుంటాము. అయితే మనకు ఇళ్లలో మూలల్లో కనిపించే సాలీడు గూడు కట్టడానికి ఉపయోగించే దారం బరువులెత్తగలదా... అసాధ్యం అనుకుంటున్నారా... అయితే ఇలాంటి దారం కూడా బరువులెత్తుతుందట. అంతేకాదు... సాలీడు దారం చక్కటి విద్యుత్ వాహకంగా కూడా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో తేలింది.
ఫ్లోరిడా విశ్వవిద్యాలయానికి చెందిన భౌతిక శాస్త్రవేత్తలు ఈడెన్ స్టీవెన్ ప్రత్యేక పరిశోధనల్లో కర్బన సూక్ష్మ నాళాల సాయంతో సాలెపురుగు పట్టు దారాన్ని విద్యుత్ వాహకంగా ఉపయోగించుకోవచ్చని తేలింది. దీనికి సంబంధించి కార్బన్ నానో ట్యూబ్స్ ఆన్ ఏ స్పైడర్ సిల్క్ స్కాఫ్ఫోల్డ్ అనే పరిశోధనా పత్రాలు నేచుర్ కమ్యూనికేషన్స్ అనే ఆన్లైన్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. తన పరిశోధన గురించి స్టీవెన్ మాట్లాడుతూ సాలెపురుగు దారాన్ని కర్బన సూక్ష్మనాళాల తొడుగుతో తయారుచేస్తారు. దీనిని తేమను గుర్తించేందుకు, బరువులెత్తే పరికరాల్లోను ఉపయోగించుకోవచ్చని, ఇది ఒక సాధారణ విద్యుత్తు తీగలాగే పనిచేస్తుందని చెబుతున్నారు.