: సరదా వాతావరణంలో 'సత్య 2' ఆడియో వేడుక


రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన 'సత్య 2' చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఈ సాయంకాలం హైదరాబాదు, మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో వేడుకగా జరిగింది. పూరీ జగన్నాథ్ , బోయపాటి, రేవంత్ రెడ్డి, మంచు విష్ణు, లక్ష్మీప్రసన్న, సీనియర్ పోలీసధికారి పీఎస్సార్ ఆంజనేయులు, బ్రహ్మాజీ, శర్వానంద్, మధు శాలిని, సిరాశ్రీ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. సినిమాలోని ఒక్కో పాటను ఒక్కో అతిథి విడుదల చేయగా, చివర్లో పాటల సీడీలను పూరీ జగన్నాథ్ విడుదల చేయగా, బోయపాటి తొలి సీడీని స్వీకరించారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులంతా వర్మ ప్రతిభను కొనియాడుతూ మాట్లాడారు. ఆహ్లాదకర వాతావరణం లో ఈ కార్యక్రమం సరదాగా జరిగింది.

  • Loading...

More Telugu News