: డీజీపీ సుప్రీం కోర్టును వక్రీకరించారు: తెలంగాణ లాయర్ల జేఏసీ
పదవీకాలం అంశంలో రాష్ట్ర డీజీపీ దినేశ్ రెడ్డి సుప్రీం కోర్టును వక్రీకరించి క్యాట్ లో పిటిషన్ వేశారని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ఆరోపించింది. హైదరాబాదులో లాయర్ల జేఏసీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ, డీజీపీ నైతిక విలువలను గాలికొదిలేశారని వారు విమర్శించారు. ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తే న్యాయపోరాటం తప్పదని వారు స్పష్టం చేశారు. అక్రమాస్తుల కేసులో విచారణకు ఆదేశించినప్పటికీ ఆయన ఇంకా పదవిలో కొనసాగడం దుర్మార్గమని వారు దుయ్యబట్టారు. ఈ మేరకు తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి డీజీపీ పదవీకాలాన్ని పొడిగించవద్దంటూ విజ్ఞప్తి చేసింది.