: బీజీపీ ఉక్కు మనిషి తుప్పు పట్టాడు : నితీష్


బీజీపీ ప్రధాని అభ్యర్థిగా మోడీని మొదట నుంచి వ్యతిరేకించి... చివరకు ఈ రోజు ఆయన్ను కొనియాడిన అద్వానీపై బీహార్ సీఎం నితీష్ కుమార్ ఛలోక్తులు విసిరారు. ఒకప్పుడు అద్వానీని భాజపా ఉక్కు మనిషిగా సంబోధించేవారని... ఇప్పుడు ఆ ఉక్కు తుప్పు పట్టిపోయిందని అన్నారు. పాట్నాలో మీడియా సమావేశంలో మట్లాడుతూ నితీష్ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అభ్యర్థిగా మోడీని ఎన్నుకోవడం మంచి నిర్ణయం కాదని... దీని వల్ల ఎన్డీఏ కూటమిలోకి కొన్ని బలమైన పార్టీలు వచ్చే అవకాశంలేదని అన్నారు.

  • Loading...

More Telugu News