: మరో స్పిన్నర్ తో బరిలోకి దిగండి: ఆసీస్ కు వార్న్ సలహా
హైదరాబాద్ టెస్టుకు ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని ఆసీస్ జట్టుకు.. ఆ దేశ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ సలహా ఇచ్చాడు. చెన్నై టెస్టులో ఆసీస్ మొత్తం వికెట్లు భారత్ స్పిన్నర్లే తీసిన విషయాన్ని వార్న్ గుర్తు చేశారు.
మార్చి 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టుకు హైదరాబాద్ ఉప్పల్ పిచ్ ను కూడా స్పిన్ కు అనుకూలంగా మలచాలని ఇప్పటికే బీసీసీఐ క్యూరేటర్ ను కోరింది. దీంతో ఈ టెస్టులోనైనా భారత్ ను నిలువరించాలంటే ఆసీస్... లీన్ తో పాటు మరో స్పిన్నర్ ను బరిలోకి దింపాలని వార్న్ సూచించాడు.