: పెరిగిన ద్రవ్యోల్బణం.. ఉల్లిపాయలే కారణం
ఆగస్టులో ద్రవ్యోల్బణం పెరిగింది. జులైలో 5.79 శాతం ఉన్న ద్రవ్యోల్బణం ఆగస్టులో 6.1 శాతానికి పెరిగింది. ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణం మూడు సంవత్సరాల తర్వాత 18.18 శాతం పెరగడం, అందులోనూ ప్రధానంగా ఉల్లిపాయల ధరలు రెండు నెలల్లోనే అధిక ధరలకు చేరుకోవడమే ఆర్థిక ద్రవ్యోల్బణం పెరగడానికి కారణాలుగా అంచనా వేశారు. ఈ వివరాలను కేంద్రం విడుదల చేసింది.