: 'బాపిరాజు'కు చీరకట్టారు!
సమైక్యాంధ్ర ఉద్యమంలో వినూత్నంగా నిరసనలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అందులో ఎంపీ కనుమూరి బాపిరాజుకు చీరకట్టారు. అంతేగాకుండా దానిపై.. 'చూడు పిన్నమ్మా, పాడు పిల్లడూ.. రాజీనామా చేయనంటున్నాడు ' అని రాశారు. దీంతో, కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఫ్లెక్సీ తొలగించాల్సిందే అని పట్టుబట్టారు. అయితే, ఇందుకు నిరాకరించిన నాన్ పొలిటికల్ జేఏసీ కార్యకర్తలు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఉద్యమంలో భాగంగానే ఫ్లెక్సీ ఏర్పాటు చేశామని, వ్యక్తిగత ద్వేషం ఏమీలేదని వివరణ ఇచ్చారు. కానీ, కాంగ్రెస్ నేతలు వినిపించుకోకుండా ఆ ఫ్లెక్సీలను అక్కడి నుంచి తొలగించారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్తత నెలకొంది.