: విభజన పాపంతోనే కాంగ్రెస్ పెద్దలకు రోగాలు: టీడీపీ
రాష్ట్రాన్ని విభజించాలన్న నిర్ణయం తీసుకుని పాపానికి ఒడిగట్టినందునే కాంగ్రెస్ పెద్దలు భయంకర రోగాల పాలిట పడ్డారని టీడీపీ నేత కోడెల శివప్రసాద్ వ్యాఖ్యానించారు. గుంటూరులో నేడు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రాన్ని విడగొట్టాలని చూస్తే ఎవరైనా సర్వనాశనంకాక తప్పదని హెచ్చరించారు. సోనియాకు కేన్సర్, షిండేకు ఊపిరితిత్తుల వ్యాధి, ఆంటోనీకి ప్రోస్టేట్ సర్జరీ, ఆజాద్ కు మెడనొప్పులు వచ్చి మంచాన పడడం రాష్ట్ర విభజన పాప ఫలితమేనని కోడెల సూత్రీకరించారు.