: వారిలా దిగజారి నేను ప్రవర్తించలేను: రేణుకా చౌదరి


నిన్న జరిగిన తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశంలో కొందరు తనను వ్యతిరేకించడంపై ఎంపీ రేణుకాచౌదరి మండి పడ్డారు. పబ్లిసిటీ కోసమే కొంత మంది ఎలా పడితే అలా మాట్లాడుతున్నారని ఘాటుగా స్పందించారు. టీఆర్ఎస్ తో లోపాయకారీ ఒప్పందాలు చేసుకున్నందునే కొంతమంది ఇలా ప్రవర్తిస్తున్నారని అన్నారు. ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం తనకు లేదని తెలిపారు. వారిలా దిగజారి నేను మాట్లాడలేనని.. సొంత పార్టీ వారిపై విమర్శలు చేయలేనని రేణుక తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై ప్రకటన చేసింది కాబట్టి కొంతకాలం ఓపిక పట్టాలని సూచించారు. 2014 లోపు తెలంగాణ వస్తుందో రాదో తాను స్పష్టంగా చెప్పలేనని అన్నారు. సీమాంధ్ర ప్రజల, నేతల బాధను, ఆక్రోశాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News