: ఇవిగో నా ఆస్తుల వివరాలు: చంద్రబాబు


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన ఆస్తులతో పాటు కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఈ మధ్యాహ్నం తన నివాసంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన పేరిట రూ. 42.06 లక్షలు, భార్య భువనేశ్వరి పేరిట రూ.3305.02 లక్షలు, కుమారుడు లోకేశ్ పేరిట రూ.492.53 లక్షలు, కోడలు బ్రాహ్మణి పేరిట రూ.330.69 లక్షల విలువైన ఆస్తులున్నాయని వివరించారు. హెరిటేజ్ కంపెనీని తాము 1992లో స్థాపించామని, విలువలు, క్రమశిక్షణతో నడపడం వల్లే హెరిటేజ్ ఈ స్థాయికి చేరిందని తెలిపారు. ఈ ఏడాది హెరిటేజ్ ద్వారా 30 శాతం డివిడెండ్ చెల్లించామని పేర్కొన్నారు. హెరిటేజ్ సంస్థ నిర్వహణలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని బాబు చెప్పారు.

ఓ రాజకీయ నాయకుడిగా ప్రజలకు జవాబుదారీగా ఉండాలనే ఆస్తుల వివరాలను వెల్లడించానన్నారు. తాను చూపించిన ఆస్తులే కాకుండా ఇంకా ఇతర ఆస్తులు ఉన్నాయని నిరూపిస్తే సంస్థలో వాటా ఇస్తామని బాబు రాజకీయ ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. ప్రజా జీవితంలో ఉన్న నేతలందరూ ఆస్తులు ప్రకటించాలని సూచించారు.

  • Loading...

More Telugu News