: ఈ కాక్ టెయిల్ యమడేంజర్!


మద్యాన్ని మరో రకం మద్యంతో కలిపి కొడితే అది కాక్ టెయిల్ అవుతుంది! అది మాంచి కిక్కిస్తుందని మందుబాబుల నమ్మకం. అయితే, మద్యాన్ని వేరే ఎలాంటి రకం మద్యంతోనైనా కలపొచ్చుగానీ, ఎనర్జీ డ్రింకులతో కలిపి తాగొద్దని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. ఇది ప్రమాదకర కాంబినేషన్ అని వారు తెలిపారు. అన్నింట్లోకి రెడ్ బుల్ ను వోడ్కాతో కలిపి తాగొద్దని సూచించారు. ఇలాంటి వెరైటీ మిక్స్ గుండె ఆరోగ్యానికి చేటు తెస్తుందని ఆస్ట్రేలియాకు చెందిన డైకిన్ యూనివర్శిటీ పరిశోధకుడు ప్రొఫెసర్ పీటర్ మిల్లర్ పేర్కొన్నారు. దీనివల్ల తీవ్ర స్థాయిలో దుష్పరిణామాలు కలుగుతాయని వివరించారు.

  • Loading...

More Telugu News