: హైదరాబాదులో పేలుడు పదార్థాలు స్వాధీనం!


ఇండియన్ ముజాహిదిన్ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ వెల్లడించిన వివరాల ఆధారంగా పోలీసులు హైదరాబాదు, మంగుళూరు నగరాల్లో భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. హైదరాబాదులోని అబ్దుల్లాపూర్, మంగుళూరులోని జెఫైర్ హైట్స్ ప్రాంతాల్లో ఇండియన్ ముజాహిదిన్ స్థావరాలపై దాడులు చేసిన పోలీసులు 90 వరకు ఐఈడీ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ 'రెడీ టు యూజ్' బాంబులని తేలడంతో భారత్ లో పెద్ద ఎత్తున విధ్వంసానికి ఉగ్రవాదులు కుట్ర పన్నినట్టు తెలుస్తోంది. యాసిన్ భత్కల్ అరెస్టు కాకముందు ఈ స్థావరాలను తెహ్సీన్, వకాస్ పరిరక్షించారు. వీరిద్దరూ యాసిన్ కు అత్యంత నమ్మకస్తులని నిఘా వర్గాలంటున్నాయి. యాసిన్ అరెస్టుతో ఆ బాంబులను స్థావరాల్లోనే వదిలి వీరిద్దరూ పరారయ్యారు.

  • Loading...

More Telugu News