: సమైక్యమే ముందు, తర్వాతే సమన్యాయం: టీడీపీ ఎంపీ


రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం సీమాంధ్రలో నిరసన జ్వాలలు మిన్నంటుతున్న నేపథ్యంలో ముందు సమైక్యానికే తమ ప్రాధాన్యత అని, ఆ తర్వాతే సమన్యాయమని టీడీపీ ఎంపీ శివప్రసాద్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలతో విభజన ప్రక్రియ నిలిచిపోయిందని అన్నారు. సీమాంధ్రలో సాగుతున్న ఉద్యమ ప్రభావంతో కేంద్రం నిర్ణయం వెనక్కి తీసుకోవడం తథ్యమని చెప్పారు. తెలంగాణ నాయకులు సహనం పాటించాలని చెబుతున్న కాంగ్రెస్ అధిష్ఠానం, సీమాంధ్ర నేతలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందని శివప్రసాద్ ఆరోపించారు. ఇరు ప్రాంతాల కాంగ్రెస్ నేతలు సోనియా అంటే భయపడుతున్నట్టుందని ఆయన ఎద్దేవా చేశారు.

ఇక షెడ్యూల్ ప్రకారమే బాబు బస్సు యాత్ర ముగిసిందని, తెలుగువారి ఆత్మగౌరవం పేరిట చేపట్టిన ఆ యాత్రకు విశేష స్పందన లభించిందని చెప్పారు. తెలంగాణ అంశంలో బాబును దోషిగా నిలిపి లబ్ది పొందాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని శివప్రసాద్ ఆరోపించారు.

  • Loading...

More Telugu News