: ఆరోపణలను పట్టించుకోనంటున్న మంత్రి డీఎల్
సహకార సంఘాల ఎన్నికలతో తనకెలాంటి సంబంధం లేదంటున్నారు మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి. అసలు సహకార సంఘాల ఎన్నికలు మొదలైనప్పటి నుంచి తాను దూరంగానే ఉన్నానని ఆయన వెల్లడించారు. తనపై వచ్చిన ఆరోపణలను పట్టించుకోనని ఆయన స్పష్టం చేశారు. కడప జిల్లా సహకార సంఘాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి డీఎల్ రవీంద్రారెడ్డే కారణమని ఆ పార్టీ నేతలు వీరశివారెడ్డి, వరదరాజులు రెడ్డి ఆరోపించిన సంగతి విదితమే.