: దీనికి క్యాన్సర్‌ను అడ్డుకునే శక్తివుంది


మనం రోజూ మన ఆహారంలో పండ్లను కూడా తీసుకోవాలి. పండ్లలో కూడా నారింజ పండు తీసుకుంటే మన ఆరోగ్యానికి మరింత మేలని నిపుణులు చెబుతున్నారు. పండ్లు ఆహారంతోబాటు తీసుకోవడం వల్ల వాటిలో ఉండే పీచు పదార్ధం మన శరీరానికి నేరుగా అందడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని పలువురు చెబుతుంటారు. అయితే పండ్లలో ప్రధానంగా నారింజ పండును తీసుకోవడం వల్ల క్యాన్సర్‌ వ్యాధికి చెక్‌ చెప్పవచ్చని ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది.

నారింజలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్‌ వ్యాధిని అడ్డుకుంటాయి. శరీరానికి ఎంతో మేలు చేస్తాయని అధ్యయనకర్తలు చెబుతున్నారు. అలాగే శరీరంలోకి ప్రవేశించే వైరస్‌లు, సూక్ష్మజీవులను నిరోధించే సామర్ధ్యం నారింజకుందని పరిశోధకులంటున్నారు. రోజూ నారింజ రసం తాగడం వల్ల క్యాన్సర్‌ వ్యాధిని కూడా నివారించవచ్చని ఈ అధ్యయన కర్తలు చెబుతున్నారు. అయితే పరిమితికి మించి ఈ రసం తాగడం వల్ల కూడా ప్రమాదమేనట. ప్రత్యేకించి చిన్న పిల్లలు, షుగరువ్యాధిగ్రస్తులు ఎక్కువ మోతాదులో నారింజ రసం తీసుకోవడం అంత మంచిది కాదని కూడా హెచ్చరిస్తున్నారు. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలను న్యూట్రిషన్‌`క్యాన్సర్‌ పత్రిక ప్రచురించింది.

  • Loading...

More Telugu News