: సీఎం వైఖరి మార్చుకోకుంటే బయటికి వచ్చేస్తామని టి-మంత్రులు చెప్పాలి: గుత్తా


సీఎం కిరణ్ వైఖరిపై తెలంగాణ కాంగ్రెస్ నేతల విస్తృతస్థాయి సమావేశంలో ప్రధానంగా చర్చ సాగింది. హైదరాబాదు మినిస్టర్స్ క్వార్టర్స్ లో జరిగిన ఈ భేటీలో చర్చకు వచ్చిన విషయాలను ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో పంచుకున్నారు. సీఎం కిరణ్ తో పాటు సీమాంధ్ర మంత్రులు సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామాలు చేస్తామని చెబుతున్నారని పేర్కొన్నారు. 45 రోజులుగా తాము ఈ విషయమై ఎంతో సహనంతో ఉన్నామని, ఇక ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. సోనియా గాంధీ చెప్పినందునే సంయమనం పాటిస్తున్నామని అన్నారు. సీఎం తన వైఖరి మార్చుకోకపోతే తాము బయటికి వచ్చేస్తామని తెలంగాణ మంత్రులు గట్టిగా చెప్పాలని గుత్తా సూచించారు.

  • Loading...

More Telugu News