: కాంగ్రెస్ కు ఆ దమ్ము లేదంటున్న దత్తాత్రేయ
కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల అజెండా ప్రకటించే దమ్ములేదని బీజేపీ సీనియర్ నేత దత్తాత్రేయ ఎద్దేవా చేశారు. బీజేపీ పార్టీ మోడీని ప్రధానిగా ప్రకటించి ఎన్నికల అజెండాతో ముందుకెళుతున్నామని పేర్కొన్నారు. హైదరాబాదులో నేడు మీడియాతో మాట్లాడుతూ, ప్రజా సమస్యలను గాలికొదిలేసిన కాంగ్రెస్ ను ప్రజలు ఓడిస్తారని చెప్పారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలను పలుమార్లు పెంచిన కేంద్రం.. విద్యుత్ చార్జీలు, గ్యాస్ ధరలనూ పెంచనున్నట్టు తెలుస్తోందని అన్నారు. ప్రజల్లో ఆ పార్టీపై వ్యతిరేకత వ్యక్తమవుతోందని, వచ్చే ఎన్నికల్లో ఎన్డీయేదే విజయమని దత్తాత్రేయ ధీమా వ్యక్తం చేశారు.