: మరోసారి కవ్వింపులకు పాల్పడిన పాక్ సైన్యం


పాకిస్తాన్ సైన్యం భారత సరిహద్దుల్లో మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. జమ్మూకాశ్మీర్లోని మెంధర్ సెక్టార్లో పాక్ బలగాలు ఈ ఉదయం కాల్పులకు తెగబడ్డాయి. పూంఛ్ జిల్లాలో నియంత్రణ రేఖ పొడవునా భారత సైనిక పోస్టులపై కాల్పులు జరిపాయి. ఈ దాడుల్లో పాక్ సైన్యం ఆటోమేటిక్ ఆయుధాలతో పాటు తేలికపాటి ఆయుధాలను వినిగించినట్టు భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి. పాక్ దుశ్చర్యను దీటుగా తిప్పికొట్టినట్టు భారత సైన్యం పేర్కొంది. కాగా, కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించడం ఇటీవల పరిపాటిగా మారింది. భారత విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, పాక్ విదేశీ వ్యవహారాల కార్యదర్శి సర్తాజ్ అజీజ్ కిర్గిజ్ స్తాన్ లో భేటీ అయి ఇరుదేశాల మధ్య సంబంధాలపై చర్చించి మూడ్రోజులు కూడా గడవకముందే దాయాది ఉల్లంఘనకు పాల్పడడం గమనార్హం.

  • Loading...

More Telugu News