: రాహుల్ గాంధీని టార్గెట్ చేసిన యోగా గురు


ప్రముఖ యోగా గురు బాబా రామ్ దేవ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లక్ష్యంగా వాగ్బాణాలు సంధించారు. రాహుల్ గాంధీని ఓ మూర్ఖ బాలుడిగా అభివర్ణించారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్లో ఓటర్ల చైతన్య కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేగాకుండా, 'రాహుల్ సోషల్ మీడియా మొద్దబ్బాయి అని విమర్శించారు. అంతకుముందు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ 'సింప్లీ గ్రేట్' అని కొనియాడారు. ఇక ప్రధానినీ రామ్ దేవ్ వదల్లేదు. మన్మోహన్ ఇంతకుముందు ప్రపంచ బ్యాంకు సేవకుడిగా వ్యవహరించారని, ఇప్పుడు సోనియా సేవకుడిగా కొనసాగుతున్నారని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News