: అందరి కళ్ళూ యువరాజ్ పైనే


యువరాజ్ సింగ్.. భారత క్రికెట్ జట్టు 1983 తర్వాత మళ్ళీ వన్డే వరల్డ్ కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన డాషింగ్ క్రికెటర్. సొంతగడ్డపై జరిగిన 2011 ప్రపంచకప్ టోర్నీలో తన ఆల్ రౌండ్ ప్రతిభతో మ్యాన్ ఆఫ్ ద టోర్నీగా నిలిచాడు. అయితే, దురదృష్టవశాత్తు కేన్సర్ మహమ్మారి బారిన పడి కెరీర్లో వెనకబడ్డాడు. ఇప్పుడు కోలుకున్నా, ఫామ్ దొరకబుచ్చుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. తాజాగా విండీస్-ఏ జట్టుతో వన్డే సిరీస్ ఆడే భారత్-ఏ జట్టుకు కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఆ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డే ఈ ఉదయం బెంగళూరులో మొదలైంది. వర్షం వల్ల 42 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో అందరి కళ్ళూ యువరాజ్ పైనే ఉంటాయనడంలో సందేహంలేదు. మళ్ళీ టీమిండియాలో బెర్తు ఆశిస్తున్న యువీ అటు బ్యాట్ తో ఇటు బంతితో ఎలా రాణిస్తాడో అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

కాగా, చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో విండీస్-ఏ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్ కు దిగిన భారత్-ఏ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఉన్ముక్త్ చాంద్ 1 పరుగు చేసి అవుటయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 2.5 ఓవర్లలో 8 పరుగులే. ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ రాబిన్ ఊతప్ప (6 బ్యాటింగ్)కు తోడు కెప్టెన్ యువరాజ్ సింగ్ (0 బ్యాటింగ్) ఉన్నాడు.

  • Loading...

More Telugu News