: జేపీకి ఉద్యోగుల సెగ
'తెలుగుతేజం' పేరిట బస్సుయాత్ర చేపట్టిన లోక్ సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణకు అనంతపురం జిల్లాలోనూ చేదు అనుభవమే ఎదురైంది. ఆయన యాత్రను అడ్డుకునేందుకు ఉద్యోగ సంఘాల నేతలు యత్నించారు. సమైక్యాంధ్రపై వైఖరి చెప్పాలని వారు ఆయనను నిలదీశారు. నిన్న కర్నూలు పట్టణంలోనూ జేపీని సమైక్యవాదులు అడ్డగించారు. దీంతో, అక్కడి తెలుగుతల్లి విగ్రహం వద్ద నిర్వహించిన తెలుగుతేజం సభ నుంచి ఆయన అర్థాంతరంగా వెళ్ళిపోయారు.