: సమైక్య గర్జన ఢిల్లీ దాకా వినిపించాలి: గంటా


విశాఖలో జరిగే సమైక్య గర్జన సభ సందర్భంగా సమైక్య ఉద్యమ తీవ్రత ఢిల్లీకి తెలిసేలా చేయాలని మంత్రి గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. నాన్-పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 21న విశాఖ ఆర్కే బీచ్ లో సమైక్య గర్జన సభ జరగనుండగా, ఆ సభకు సంబంధించిన పోస్టర్ ను మంత్రి నేడు ఆవిష్కరించారు. ఏపీఎన్జీవోల తరహాలో హైదరాబాదులోనే మరో సభ జరిపాలని భావిస్తున్నట్టు చెప్పారు. కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News