: భారత్ లో అంతర్జాతీయ మహిళా సినీ ఉత్సవం


అంతర్జాతీయ మహిళా సినీ ఉత్సవాన్ని మొట్టమొదటిసారిగా మనదేశంలో నిర్వహించనున్నారు. ఈ ఉత్సవానికి ముంబై ఆతిథ్యమివ్వబోతోంది. అక్టోబర్ 8 నుంచి ఏడురోజుల పాటు ఈ సినీ పండుగ జరగనుంది. సినీ పరిశ్రమలో మహిళా దర్శకులను ప్రోత్సహించేందుకే ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. మహారాష్ట్ర పర్యాటక శాఖ సహకారంతో ఆక్యులస్ క్రియేషన్స్ సంస్థ ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ ఉత్సవంలో సుమారు 70 దేశాలకు చెందిన 150 సినిమాలను ప్రదర్శించనున్నారు.

  • Loading...

More Telugu News