: పవన్ కల్యాణ్ కు 'ఉత్తమనటుడు' అవార్డు


పవన్ కల్యాణ్ కు సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) పురస్కారం లభించింది. 'గబ్బర్ సింగ్' చిత్రానికి గాను ఉత్తమనటుడిగా సైమా అవార్డుకు పవన్ ఎంపికయ్యాడు. గురు, శుక్రవారాల్లో ఈ అవార్డుల ప్రదానోత్సం షార్జాలో జరిగింది. ఇక, 'గబ్బర్ సింగ్' సినిమాలో హీరోయిన్ గా నటించిన శృతి హాసన్ కు ఉత్తమనటి అవార్డు దక్కింది. 'గబ్బర్ సింగ్' మొత్తం ఆరు కేటగిరీల్లో పురస్కారాలను చేజక్కించుకోవడం విశేషం. ఉత్తమదర్శకుడిగా హరీశ్ శంకర్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్, ఉత్తమ కమెడియన్ గా శ్రీను, ఉత్తమ ఫైట్ మాస్టర్లుగా రామ్ లక్ష్మణ్ సోదరులకు ఈ అవార్డులు లభించాయి. కాగా, ఉత్తమ చిత్రం అవార్డును రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఈగ' ఎగరేసుకెళ్ళింది.

  • Loading...

More Telugu News