: ఈనెల 29న హైదరాబాద్ లో టీ-జేఏసీ సదస్సు


తెలంగాణ ప్రక్రియను కేంద్రం మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు టీ-జేఏసీ సదస్సు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 29న హైదరాబాదులోని నిజాం కళాశాలలో భారీ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపింది. ముందు 30వ తేదీన ఈ సదస్సు పెట్టాలనుకున్నప్పటికీ ఓ రోజు ముందుకే జరిపారు. దీనికి 'సకల జనుల భేరీ' గా నామకరణం చేశారు. ఈ నేపథ్యంలో నాచారంలోని నోమా ఫంక్షన్ హాలులో తెలంగాణ జేఏసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. తాజా పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.

  • Loading...

More Telugu News