: లోక్ సత్తా కార్యకర్తలు, సమైక్యవాదుల మధ్య తోపులాట


కర్నూలులో లోక్ సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ చేపట్టిన తెలుగుతేజం బస్సుయాత్ర ఉద్రిక్తంగా మారింది. ఈ ఉదయం పట్టణంలోని తెలుగుతల్లి విగ్రహం వద్ద ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్న సమైక్యవాదులు ఆ తర్వాత కూడా అడుగడుగునా ఆయనకు అడ్డుతగిలారు. విభజన ప్రకటనపై స్పష్టమైన అభిప్రాయం తెలపకుండా, యాత్ర ఎలా చేస్తారని సమైక్యవాదులు మండిపడ్డారు. ఈ సందర్భంగా లోక్ సత్తా కార్యకర్తలకు, సమైక్యవాదులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

  • Loading...

More Telugu News