: బెయిల్ కు బేరం కుదిరింది, దర్యాప్తు స్పీడు తగ్గింది: పయ్యావుల


జగన్ కు బెయిల్ కోసం బేరం కుదిరినందువల్లే సీబీఐ, ఈడీలు దర్యాప్తులో వేగం తగ్గించాయని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించారు. హైదరాబాదులో నేడు మీడియాతో మాట్లాడారు. జగన్ బెయిల్ లాలూచీ విషయమై ఢిల్లీ వెళ్ళి దర్యాప్తు సంస్థలను కలిసి అక్రమాలను ఉపేక్షించవద్దని కోరతామని తెలిపారు. బెయిల్ కోసం కాంగ్రెస్ తో ఒప్పందం జరిగి ఉంటుందన్నదే తమ అనుమానమని పేర్కొన్నారు. సీబీఐ, ఈడీల దర్యాప్తులో వేగం మందగించడమే తమ సందేహానికి కారణమని చెప్పారు. ఇక రాష్ట్ర విభజన అంశంపై స్పందిస్తూ.. రాష్ట్రంలో ఇంత జరుగుతున్న కేంద్రం కన్నెత్తి చూడకపోవడం దారుణమన్నారు. ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి, ప్రధాని మంత్రిని కలిసి రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితిని తొలగించాలని కోరతామని అన్నారు.

  • Loading...

More Telugu News