: నమ్మిన వారిని ముంచే రకం మోడీ: దిగ్విజయ్
బీజేపీ 'పందెం కోడి' నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ విమర్శల బాణం ఎక్కుపెట్టారు. మోడీ ఒక నాటకాల రాయుడని ఎద్దేవా చేశారు. సహకరించిన వారినే ముంచే నైజం మోడీదని విమర్శించారు. తనకు సహకరించిన కేశూభాయ్ పటేల్, అద్వానీ, శంకర్ సింఘ్ వాఘేలాలను మోడీ తొక్కేశారని అన్నారు. మోడీ ప్రధాని అభ్యర్థిత్వం విషయమై బీజేపీలో కానీ, ఎన్డీఏలో కానీ ఏకాభిప్రాయం లేదని తెలిపారు.