: నిర్ణయంపై పునఃసమీక్షించాల్సిందే: సీమాంధ్ర మంత్రులు


జులై 30న తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయంపై పునఃసమీక్షించాల్సిందే అని సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు ముక్తకంఠంతో నినదించారు. హైదరాబాదులోని మంత్రుల నివాస సముదాయంలో సీమాంధ్ర మంత్రులు, ఎంపీల భేటీ ముగిసింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు సమావేశం వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆంటోనీ కమిటీని హైదరాబాదు రావాలని ఆహ్వానించామని తెలిపారు. వారు వచ్చి సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాన్ని కళ్ళారా చూసి, చెవులారా నినాదాలను విని నిర్ణయం తీసుకోవాలని కావూరి కోరారు.

ఇక, తామందరిదీ ఒకటే అభిప్రాయమని, రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నదే తమ అభిమతమని, దాంట్లో ఎలాంటి మార్పులేదని ఉద్ఘాటించారు. తమ మధ్య విభేదాలున్నాయని వస్తున్న వార్తలన్నీ కాకమ్మ కబుర్లని కావూరి కొట్టిపారేశారు. తమలో ఎవరికీ అధికార కాంక్షలేదని చెప్పుకొచ్చారు. తమ ఒత్తిడి కారణంగానే అధిష్ఠానం, ఆంటోనీ కమిటీ పునరాలోచనలో పడ్డాయని అన్నారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ, 2009లో కేసీఆర్ చస్తాడన్న భయంతోనే ప్రకటన చేశారని పేర్కొన్నారు. కేసీఆర్ దీక్ష నటన మాత్రమే అని పార్టీ పెద్దలకు వివరించామని చెప్పారు.

  • Loading...

More Telugu News