: నేటి అర్ధరాత్రితో ముగుస్తున్న సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల సమ్మె
మూడు రోజుల నుంచి కొనసాగుతున్న విద్యుత్ జేఏసీ ఉద్యోగుల 72 గంటల సమ్మె నేటి అర్ధరాత్రితో ముగుస్తున్నట్లు విద్యుత్ జేఏసీ ఛైర్మన్ సాయిబాబా తెలిపారు. రేపటినుంచి ఉద్యోగులందరూ విధుల్లోకి యథావిధిగా పాల్గొంటారని చెప్పారు. ప్రభుత్వానికి అప్పగించిన సిమ్ లను రేపు తిరిగి తీసుకుంటామన్నారు. ఇప్పుడు సమ్మె ముగుస్తున్నా ఇది ఆరంభం మాత్రమేనని చెప్పారు. ఈ నెల 16, 17 తేదీల్లో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.