: అద్వానీతో సుష్మాస్వరాజ్ భేటీ
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎల్కే అద్వానీతో మరో అగ్రనేత సుష్మా స్వరాజ్ సమావేశమయ్యారు. గుజరాత్ సీఎం నరేంద్ర మోడీని బీజేపీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని తొలి నుంచి వ్యతిరేకిస్తున్న అద్వానీతో సుష్మ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. నిన్న ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి గైర్హాజరైన అద్వానీ , మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేగాకుండా పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో అద్వానీతో భేటీ అయిన సుష్మా తాజా పరిణామాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.