: విభజన నిర్ణయం వెనుక రాజకీయ దురుద్దేశం: మురళీమోహన్
కేంద్ర విభజన ప్రకటన వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని టీడీపీ నేత మురళీ మోహన్ అన్నారు. కుమారుడిని ప్రధాని చేయాలనే బలమైన ఆలోచనతోనే సోనియా రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం గ్రామంలో ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు నిర్వహిస్తున్న పాదయాత్రలో మురళీమోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. సమైక్యాంధ్ర ఉద్యమం ఎన్నాళ్లు కొనసాగినా పాల్గొని, తమవంతుగా పోరాడతామన్నారు.