: సభ మధ్యలోనే వెళ్ళిపోయిన జేపీ


రాష్ట్ర విభజన అంశంపై లోక్ సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ 'తెలుగుతేజం' పేరిట బస్సు యాత్ర చేపట్టారు. ఈ ఉదయం యాత్ర కర్నూలు నుంచి మొదలైంది. ఈ సందర్భంగా ఆయన పట్టణంలోని తెలుగు తల్లి విగ్రహం వద్ద ప్రజలనుద్ధేశించి ప్రసంగిస్తుండగా సమైక్యవాదులు అడ్డుకున్నారు. పార్టీ విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో జేపీ సభ నుంచి వెళ్ళిపోయారు. అనంతరం సమైక్యవాదులు అక్కడి బానర్లను, పార్టీ జెండాలను తొలగించారు. అంతకుముందు జేపీ తన ప్రసంగంలో భాగంగా ఇతర రాజకీయపార్టీలపై మండిపడ్డారు. ఓట్లు సీట్లే లక్ష్యంగా కొన్ని పార్టీలు ఎంతకైనా దిగజారుతున్నాయని విమర్శించారు. తెలుగు ప్రజల మధ్య చిచ్చుకు కేంద్రమే కారణమని ఆరోపించారు.

  • Loading...

More Telugu News