: కడప జిల్లాలోని 15 మండలాల్లో నిలిచిన విద్యుత్ సరఫరా


కడప జిల్లాలోని 15 మండలాలు ఈ ఉదయం నుంచి విద్యుత్ లేక ఇబ్బందులు పడుతున్నాయి. శంకరాపురంలోని 220 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ లో తెల్లవారుజామున సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో, సరఫరా నిలిచిపోయింది. కడపతో పాటు ఒంటిమిట్ట, భాకరాపేట, బద్వేలు, అట్లూరు, వల్లూరు, సిద్దవటం తదితర మండలాల్లో విద్యుత్ సమస్య ఏర్పడింది. మరమ్మతులు చేసేందుకు వెళ్లిన కాంట్రాక్టు సిబ్బందిని విద్యుత్ జేఏసీ నేతలు అడ్డుకున్నారు. మరోవైపు గత మూడు రోజుల నుంచి విద్యుత్ ఉద్యోగులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News